ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో...ఉన్నత విద్యా మండలి, సెస్ మధ్య ఎం. ఓ.యూ

మెరుగైన విద్యా విధానం, ప్లానింగ్, సుపరిపాలన, కర్రికులం సమీక్ష పై దృష్టి ఐదేళ్ల ఒప్పందంపై సమన్వయం కోసం ఏడుగురితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం త్వరలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ని అమలులోకి తీసుకుని రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో మెరుగైన విద్యా విధానం, ప్రణాళికా, సుపరిపాలన, కర్రికులం సమీక్ష, తదితర అంశాలపై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ( telengana state council of higher education .. tsche ), సెంటర్ ఫర్ ఏకానమిక్ అండ్ సోషల్ స్టడీస్ ( సెస్ ) మధ్య శనివారం కౌన్సిల్ కార్యాలయంలో అవగాహన ఒప్పందం ( ఎం. ఓ.యూ ) జరిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమక్షంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. టీ పాపరెడ్డి, సెస్ డైరెక్టర్ ప్రొ. డాక్టర్ ఈ రేవతి ఎం. ఓ.యూ. పత్రాలపై సంతకాలు చేసి, పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొ. వెంకట రమణ, ప్రొ. లింబాద్రి, కార్యదర్శి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు నూతన ఒరవడిలో విద్యా విధానం కొనసాగాలని, ఈ విషయంలో సమగ్ర విశ్లేషణ, రిసెర్చ్ కోసం ఈ ఎం. ఓ.యూ. జరిగింది. ఉన్నత విద్యలో కోర్సులను మరింత పదును పెట్టడం, వృత్తి పరంగా టీచర్ లు మరింత రాటు తేలడం, సామాజిక, ఆర్థిక పరమైన ప్రణాళికల రూపకల్పన వంటి పలు అంశాలపై సెస్ సమగ్రమైన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాటు జరిగిన ఈ ఎం. ఓ.యూ. ను ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు

© 2014 Telangana State Council of Higher Education, Hyderabad:

Site Visitors Since January 21, 2017

Website Incharge: Prof. A. Sadanandam

9848203174 : webmaster@tsche.ac.in